Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిజీగా వున్న యంగ్ హీరోలు .. వెతుకులాటలో అనిల్ రావిపూడి

  • 'రాజా ది గ్రేట్'తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి 
  • వెంకటేశ్ తో మల్టీ స్టారర్ ప్లానింగ్ 
  •  మరో యువ హీరో కావాలి 
  •  అంతా బిజీ బిజీ.. 
'రాజా ది గ్రేట్' తో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న అనిల్ రావిపూడి, తదుపరి సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సారి ఆయన మల్టీ స్టారర్ సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్న ఆయన, వెంకటేశ్ ను ఒక కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నాడు. ఇక రెండవ పాత్ర కోసం యంగ్ హీరోను తీసుకోవాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం క్రేజ్ వున్న యువ కథానాయకులలో నాని .. శర్వానంద్ .. విజయ్ దేవరకొండ .. నిఖిల్ వీళ్లంతా కూడా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు. దాంతో అనిల్ రావిపూడి వెతుకులాట కొనసాగుతూనే వుంది. ఈ ప్రాజెక్టుకు ముందే వెంకటేశ్ .. తేజతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ను ఖరారు చేసే పనిలో వున్నారు. డిసెంబర్ 13వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.      
venkatesh

More Telugu News